Saturday, December 21, 2024

నాగచైతన్య-శోభిత ఫోటో వైరల్.. కామెంట్స్‌ సెక్షన్‌ ఆఫ్‌

- Advertisement -
- Advertisement -

త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల జంట మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటోను నాగ చైతన్య అభిమానులతో పంచుకున్నారు. ఎవ్రిథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ అనే క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, కామెంట్స్‌ సెక్షన్‌ మాత్రం ఆఫ్‌ చేశారు. ఇక, ట్రెండీ లుక్స్‌లో కనిపించిన వీరి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కాగా, సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య, శోభిత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తిరిగిన కొన్ని ఫోటోలు బయటకు రావడంతో.. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని నిజం చేస్తూ.. ఆగస్టు 8న నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News