Monday, October 21, 2024

ప్రధాని మోడీకి రూ.100 పంపించిన ఒడిశా గిరిజన మహిళ

- Advertisement -
- Advertisement -

ఒడిశాలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సుందర్‌గఢ్ జిల్లాలో పార్టీ సభ్యత్వ డ్రైవ్‌ జరుగుతుండగా ఓ గిరిజన మహిళ రూ.100 తీసుకొచ్చి ప్రధాని నరేంద్రమోడీకి ఇవ్వాలంటూ బిజెపి ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాకి అందజేసింది.  ‘ ప్రధాని మోడీకి నా ధన్యవాదాలు తెలియజేయండి’ అని ఆమె కోరారు. రూ.100 వద్దని జైజయంత్ చెప్పినప్పటికీ ఆమె వినలేదు. పట్టుబట్టి మరీ డబ్బు ఇచ్చి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలియజేయడానికి రూ.100 తీసుకోవాలని ఈ ఆదివాసీ మహిళ పట్టుబట్టింది. ఆమె నా వివరణలను పట్టించుకోలేదు. చివరకు నేను డబ్బు తీసుకునే వరకు పట్టుబట్టింది. ఈ పరిణామం ఒడిశాలోని భారత్ పరివర్తనకు ప్రతిబింబం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఘటన తన దృష్టికి రావడంతో మోడీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు.   ‘వికసిత్ భారత్‌’ కోసం కృషి చేసేలా ‘నారీ శక్తి’ ఆశీర్వాదం తనకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ‘ఈ ఆప్యాయత నన్ను కదిలిస్తోంది. నన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్న నారీ శక్తికి నమస్కరిస్తున్నాను. వారి ఆశీస్సులు వికసిత్ భారత్‌ నిర్మాణం దిశగా నిరంతరం కృషి చేసేందుకు నన్ను ప్రోత్సహిస్తాయి’’ అని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News