Monday, October 21, 2024

కొత్త శాసనం తేబోతున్న సిఎం చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ప్రోత్సాహకాలు

హైదరాబాద్: స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికే అవకాశం ఇచ్చేలా ఓ చట్టాన్ని తేవాలనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దంపతులు ఎక్కువ పిల్లలను కనాలని కూడా ఆయన సూచించారు. దక్షిణ భారత దేశంలో వయస్సు ఉడిగినవారి జనాభా పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘ ఎక్కువ మంది పిల్లలు ఉండేవారికి మేము ప్రోత్సహకాలు అందించాలని యోచిస్తున్నాము.  దంపతులు మరింత మంది పిల్లలు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నాము. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండ నిరోధించిన ఇదివరకటి చట్టంను ఉపసంహరించుకుంటున్నాము. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే స్థానిక ఎన్నికల్లో పోటీచేసేలా మేము కొత్త చట్టం తేబోతున్నాము’’ అని చంద్రబాబు నాయుడు  అన్నారు. ఆయన శనివారం అమరావతిలో నిర్మాణ పనులను పునరుద్ధరించిన సందర్భంగా ఈ వివరాలు తెలిపారు.

యువతీయువకులు వివిధ దేశాలకు వెళ్లి పోవడం వల్ల అనేక జిల్లాలు, గ్రామాలలో వయోవృద్ధులు ఎక్కువయిపోయారన్నారు.  భారత జనాభా వృద్ధి రేటు 1950 దశకంలో 6.2 శాతం ఉండగా 2021లో అది 2.1 శాతంకు పడిపోయిందని, కాగా ఆంధ్రప్రదేశ్ లో ఇది 1.6 శాతానికి దిగొచ్చిందని నారా చంద్రబాబు నాయుడు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News