- Advertisement -
బ్యాంకాక్: మయన్మార్ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న పోరుకు భయపడి గ్రామాన్ని వీడి పారిపోతున్న మయన్మార్ ప్రజలకు చెందిన పడవ అండమాన్ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో ఏడుగురు మరణించగా మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 30 మంది గ్రామస్తులను స్థానికులు రక్షించారు. పడవలో 70 నుంచి 75 మంది వరకు ఉంటారని ఒక గ్రామస్తుడు తెలిపాడు.
మయన్మార్‌లోని తనిన్‌హరీకు చెందిన క్యాక్ కర్ ద్వీపం నుంచి మయీక్ పట్టణానికి బయల్దేరిన పడవ బలమైన అలల కారణంగా అధిక బరువుతో అండమాన్ సముద్రంలో మునిగిపోయినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. 30 నుంచి 40 మందిని మాత్రమే మోయగల పడవలో 70 నుంచి 75 మంది ఉండడం, వారితోపాటు వారి వస్తువులు ఉండడంతో అధిక బరువుతో ముగినిపోయినట్లు ఆయన చెప్పాడు.
- Advertisement -