- Advertisement -
దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మంగళవారం తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటించనుంది. హాన్ నది పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించనుంది బృందం. ఈ నది సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంది. కాలుష్యానికి గురైన హాన్ నదిని దక్షిణ కొరియా ప్రభుత్వం శుభ్రపరచి, పునరుద్ధరించింది.
494 కిమీ మేర ప్రవహిస్తున్న హన్ నది.. సియోల్ నగరంలో 40 కిమీ మేర ప్రవాహిస్తుంది. ప్రక్షాళన తర్వాత శుభ్రంగా మారి, ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం, జలవనరుగా హన్ నది మారింది. కాగా, హైదరాబాద్ లోనూ మూసీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, మూసీ నిర్వాసితులు, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతుండటంతో కాంగ్రెస్ కాస్త వెనుకడుగు వేసింది.
- Advertisement -