Tuesday, October 22, 2024

పెళ్లి నమోదుకు హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం వ్యక్తి

- Advertisement -
- Advertisement -

ముంబై: ముస్లిం పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకునేలా వారి పర్సనల్ లాస్ అనుమతిస్తాయి. ఈ నేపథ్యంలో తన మూడో భార్య పెళ్లి రిజిష్టర్ కోసం ఓ ముస్లిం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తులు బి.పి.కొలబావాలా, సోమశేఖర్ సుందరేశన్ లో కూడిన డివిజన్ బెంచ్ అక్టోబర్ 15న థానే మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన డిప్యూటీ మ్యారేజ్ రిజిష్ట్రేషన్ ఆఫీసును ఆదేశించింది.  అల్జీరియా దేశానికి చెందిన మహిళను మూడో పెళ్లి చేసుకోడానికి ఆ ముస్లిం వ్యక్తి అర్జీ పెట్టుకున్నాడు.

వారిది మూడో పెళ్లి కానుండడంతో వారి దరఖాస్తును మహారాష్ట్ర అధికారులు తిరస్కరించారు. దాంతో వారు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. మహారాష్ట్ర చట్టాల ప్రకారం అధికారులు వారి పెళ్లి రిజిస్ట్రేషన్ తిరస్కరించారు. ముస్లింలు నాలుగు పెళ్లిళ్లు చేసుకోడానికి పర్సనల్ లాస్ అనుమతించినప్పటికీ, మహారాష్ట్ర పెళ్లి చట్టాలు ఒక్క పెళ్లినే రిజిష్టర్ చేస్తాయి. అది ముస్లిం వ్యక్తి అయినప్పటికీ.  ఆ అల్జీరియా మహిళ పాస్ పోర్టు ఈ ఏడాది మే తో ముగిసిపోయింది. కాగా కోర్టు వారి రిజిస్ట్రేషన్ అంగీకరించడమో, తిరస్కరించడమో పది రోజుల్లో స్పష్టం చేయాలంది. అంత వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కూడా పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News