ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్‌లో నందమూరి నటసింహం, లెజెండ్ బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన ప్రోమోలు అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో అనేక ప్రశ్నలు బాలయ్య సందించారట. వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారట. ఆ ప్రశ్నలు ఎంత కాంట్రవర్సీగా ఉన్నా కూడా సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చారట. ఆ ఎపిసోడ్‌లో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోలని చూస్తుంటే.. అందులో బాలయ్య ముచ్చట్లు.. చంద్రబాబు చలాకీతనం, చురుకుదనం, సమయస్పూర్తితో సమాధానాలు చెప్పే తీరు చూస్తే ఆహాలో రాబోతోన్న ఈ అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. మా బావ గారు.. మీ బాబు గారు అంటూ రైమింగ్‌తో బాలయ్య అదరగొట్టేశారు. ప్రోమోలోనే ఈ రేంజ్‌లో ఉంటే… పూర్తి ఎపిసోడ్ ఇంకెలా ఉండబోతోందో. సీఎం చంద్రబాబు నాయుడిని బాలయ్య చాలా కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది. వాటిల్లో కొన్ని ప్రశ్నలివే..
జైలు జీవితం చంద్రబాబునాయుడిలో సీమపౌరుషాన్ని నిద్రలేపిందా? వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కూడా కటకటాలపాలు చేసి కక్ష తీర్చుకోవాలన్న కసి వచ్చిందా? మాజీ సీఎంకు వ్యతిరేకంగా చంద్రబాబు సిద్ధం చేసిన ఫైల్స్ ఏంటి? అని బాలయ్య అడిగాడట. జైలు జీవితం చంద్రబాబులో మరో మనిషిని నిద్ర లేపిందా? జగన్ ఇక తీవ్ర పర్యవాసానాలు చూడబోతున్నారా? అని సంధించారట. స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో సీఎం చంద్రబాబు చెబుతున్నదేంటి? అని కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగారట.
ఏ నిర్ణయం తీసుకోవడంలో నైనా అచితూచి వ్యవహరించే చంద్రబాబు, గత అయిదేళ్ల పరిణామాలు చూసిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులకు దూకుడుగా సమాధానమిస్తారా లేదా ఎప్పటిలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారట. 53రోజులు చంద్రబాబునాయుడు జైల్లో ఎలా గడిపారు ? సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు… ఓ నిందితుడిగా ఆ గదుల్లోనే గడపాల్సి రావడంతో ఎలా ఫిలయ్యారు? రాజమండ్రి జైల్లో విఐపిగా గడిపారా? భయంతో ఉక్కిరిబిక్కిరిఅయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారట.
రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల మధ్య నుంచి చంద్రబాబునాయుడు చూసిన ప్రపంచం ఎలా ఉంది? చదివిన పత్రికలేంటి? చూసిన టీవీలేంటి? కొత్తగా అలవర్చుకున్న అలవాట్లేంటి? అని బాలయ్య తన బావ గారైన చంద్రబాబు నాయుడిని అడిగేశారట. టీడీపీ-జనసేన మధ్య పొత్తును పవన్‌కల్యాణ్ ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు రాజమండ్రిలోని సెంట్రల్ జైలు నాలుగుగోడల మధ్య జరిగిన మంత్రాంగమేంటి? ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ తర్వాత వచ్చిన ప్రకటనా? పవన్ ఎమోషన్‌లో తీసుకున్న నిర్ణయమా? అని ప్రశ్నలు సంధించాడట.
లోకేష్, పవన్‌కల్యాణ్, బాలయ్య ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? అని అడిగారట. అడ్మినిస్ట్రేషన్, కుటుంబవ్యవహరాల్లో సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలకు చంద్రబాబు ఇస్తున్న మార్కులెన్ని అంటూ చంద్రబాబుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారట. – భవిష్యత్తులో టీడీపీని సమర్థవంతగా నడపగల శక్తి లోకేష్ ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఏం చెప్పారన్నది కూడా ఎపిసోడ్‌లో ఉంటుందట. గ్రౌండ్ లెవెల్లో జనసేన, టీడీపీ మధ్య సమన్వయ లోపం ఉందా? ప్రోటోకాల్ విషయంలో టీడీపీ నాయకులు జనసేనను తక్కువగా చూస్తున్నారా? అని అందరిలోనూ ఉన్న అనుమానాల్ని అడిగేశారట. అమరావతి అందరికి రాజధానా? లేదా సంపన్నులకు మాత్రమే రాజధానిగా మారనుందా?అని కూడా నేరుగా అడిగేశారట. ఇక ఇలాంటి చిక్కు ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి సమాధానాలు చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
https://x.com/ahavideoIN/status/1848619018514551167