Sunday, December 22, 2024

80 విమానాలకు బాంబు బెదరింపులు

- Advertisement -
- Advertisement -

భారత విమానయాన సంస్థలకు చెందిన సుమారు 50 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు మంగళవారం బాంబు బెదరింపులు వచ్చాయి. దీనితో సోమవారం రాత్రి నుంచి బాంబు బెదరింపులు అందుకున్న విమానాల సంఖ్య సుమారు 80కి పెరిగిందని అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. ఎయిర్ ఇండియా, ఇండిగోకు చెందిన చెరి 13 విమానాలకు, 12 ఆకాశ ఎయిర్ విమానాలకు, 11 విస్తారా విమానాలకు మంగళవారం బెదరింపులు వచ్చాయని ఆ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారాకుచెందిన పదేసి విమానాలకు బెదరింపులు రాగా, జెడ్డా వెళ్లవలసిన మూడు ఇండియా విమానాలను సౌదీ అరేబియా,

ఖతార్‌లోని విమానాశ్రయాలకు మళ్లించారు. ఒక వారంపైగా క్రితం భారత విమానయాన సంస్థలకు చెందిన 170 పైగా విమానాలకు బాంబు బెదరింపులు వచ్చాయి. తమ విమానాలు కొన్నిటికి మంగళవారంభద్రత అలర్ట్‌లు అందాయని, స్థానిక అధికారులతో సమన్వయంతో అన్ని భద్రత, రక్షణ ప్రక్రియలు అనుసరిస్తున్నామని ఆకాశ ఎయిర్ అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. అయితే, అటువంటి హెచ్చరికలు ఎన్ని విమానాలకు వచ్చాయో సంస్థ వెల్లడించలేదు. కాగా, మంగళవారం తమ విమానాలకు అందిన బెదరింపులపై ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా నుంచి వెంటనే ప్రకటనలు ఏవీ వెలువడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News