Sunday, December 22, 2024

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ పెబ్బేరు కమిషనర్ ఆదిశేషు

- Advertisement -
- Advertisement -

మరో అవినీతి చేప ఎసిబి అధికారుల వలకు చిక్కింది. లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఎసిబి అధికారులకు చిక్కా రు. బాధితుడినుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. మంగళవారం పక్కా సమాచారంతో వనస్థలిపురం పరిధిలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిం చారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని కమ్మగూడ రాజరజిత హోమ్స్‌లో ఆదిశేషు ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఆదిశేషును ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్ నగర్ ఎసిబి డిఎస్‌పి శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News