Monday, December 23, 2024

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే లీగల్ నోటీసు:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేకే కెటిఆర్ లీగల్ నోటీసు పంపించారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నోటీసుకు నోటీసుతోనే సమాధానం చెబుతానని ఆయన స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పంపిన లీగల్ నోటీసుపై కేంద్రమంత్రి బుధవారం ఘాటుగా స్పందించారు. లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారెవరు లేరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. వారంలోపు బండి సంజయ్ క్షమాపణలు చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కెటిఆర్ హెచ్చరించారు. ఈ విషయమై సంజయ్ మాట్లాడుతూ కెటిఆర్‌పై తాను మొదట ఆరోపణలు చేయలేదని, తనపైనే ఆయన మొదట చేశారని, దీంతో తాను స్పందించాల్సి వచ్చిందని అన్నారు.

కెటిఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో ఆయన బాగోతం ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు అంశాల్లో ఏం జరిగిందో యావత్ తెలంగాణకు తెలుసునని, ఆ కేసులను ఏవిధంగా నీరుగార్చారో అందరికి తెలుసునని విమర్శించారు. ఇప్పటి వరకు తాను కెటిఆర్ మాటలకు మాటలతోనే కౌంటర్ ఇచ్చానని, తనకు లీగల్ నోటీసులు పంపించినందున తానూ నోటీసులతోనే బదులిస్తానని బండి స్పష్టం చేశారు. తాము చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తామని, వాటితోనే ముందుకు సాగుతామని తెలిపారు. కెటిఆర్ పరిస్థితిని చూస్తుంటే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు. ఆయన బాగోతం అంతా ప్రజలకు తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదిలిచ్చానని లీగల్ ఇక నోటీసులకు నోటీసులతోనే జవాబిస్తానని కాచుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News