Thursday, October 24, 2024

ఎసిబికి చిక్కిన విద్యుత్ ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

ఓ ఇంటి యాజమాని నుండి లంచం తీసుకుంటున్న విద్యుత్ ఉద్యోగిని ఎసిబి అధికారులు పట్టుకున్న సంఘటన బుధవారం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మున్సిపల్ పరిధి కరకవాగులో ఓ వ్యక్తి నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. తాత్కాలికంగా దీనికి అవసరమైన విద్యుత్ సౌకర్యం పక్కనే ఉన్న వారి బంధువుల ఇంటి నుండి తీసుకున్నాడు. దీనిని గమనించిన విద్యుత్ లైన్‌మెన్ నాగరాజు అక్రమంగా విద్యుత్‌ను వినియోగించు కుంటున్నారని సదరు గృహ యాజమానిపై కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు.

కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రూ.26 వేలు ఇస్తామని గృహ యాజమాని అన్నాడు.అనంతరం ఇంటి నిర్మాణ దారుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. గాంధీనగర్ 5వ వార్డులోని బిసిఎం ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద లైన్‌మెన్ లంచం తీసుకుంటుండగా ఎసిబి డిఎస్‌పి రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, గతంలో కూడా లైన్‌మెన్ నాగరాజుపై పలు ఆరోపణలు ఉన్నాయని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News