Thursday, October 24, 2024

25న రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు జాబ్-మేళా

- Advertisement -
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ నెల 25 ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. కంపెనీలోని 30 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.

డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసి, 29 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలకు ఎంప్లాయిమెంట్ అధికారి జోషిని మొబైల్ నెంబర్ 8340037123 ద్వారా సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్లతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద ఆరోజు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News