- Advertisement -
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. 106 పరుగుల లక్ష్యాన్ని సఫారీ టీమ్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ టోనీ జోర్జి (41), ట్రిస్టన్ స్టబ్స్ 30 (నాటౌట్) బ్యాట్‌తో రాణించారు. కెప్టెన్ మార్‌క్రమ్ (20) తనవంతు సహకారం అందించాడు. అంతకుముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన మెహదీ హసన్ మిరాజ్ (97) పరుగులు చేశాడు. జాకేర్ అలీ (58), రహీం (33), హసన్ జాయ్ (40) తమవంతు పాత్ర పోషించారు.
- Advertisement -