Tuesday, December 3, 2024

టీమిండియా 156 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 45.3 ఓవర్లలో 156 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ జట్టు 103 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్‌మెన్లు రవీంద్ర జడేజా(38), యశస్వి జైస్వాల్(30), శుభ్‌మన్ గిల్(30) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నార్ ఏడు వికెట్లు తీయగా గ్లెన్ ఫిలీప్స్ రెండు వికెట్లు, టిమ్ సౌథీ ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News