Friday, December 20, 2024

వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్. షర్మిల అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. వై.ఎస్. రాజశేఖర్ బతికి ఉండగా స్థాపించిన కుటుంబ వ్యాపారాల్లో మనుమలు, మనుమరాళ్లకు సమాన వాటా ఉండాలని కోరుకున్నారు. అవన్నీ జగన్ మోహన్ రెడ్డి స్వంతం కాదు. జగన్ కేవలం ‘గార్డియన్’ మాత్రమే.

రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా స్థాపించిన వ్యాపారాలు..సరస్వతి, భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ వగైరాలన్నింటిలో నలుగురు మనుమలు/మనుమరాళ్లకు సమాన వాటా ఉండాలన్నది ఆయన కోరిక. ఒక్క సండూర్ మినహా రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఎలాంటి ఆస్తి పంపకం జరగలేదు. స్వఆర్జితం అని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి బతికుండగానే ఆస్తుల పంపకం జరిగిందన్నది అవాస్తవం. నేను జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాటా అడుతున్నాననేది హాస్యాస్పదం. నాకు ఆస్తులపై వ్యామోహం లేదు. కానీ నా వారసులకు అవి చెందాల్సిందే. జగన్ ముఖ్యమంత్రి కాగానే మారిపోయారు. నేను రాజకీయాల్లోకి రావడం జగన్ కు ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమని నమ్మారు.  కేసు వేశారు. మేము మోసం చేసి వాటాలు తీసుకున్నామని ఎన్సిఎల్ టిలో కేసు వేశారు’’ అంటూ షర్మిల తన లేఖలో వివరించారు.

‘‘నేను మోసం చేసినట్లు, ఆస్తి కోసం అత్యాశ పడినట్టు భావించకూడదనే ఈ లేఖ రాస్తున్నాను. ఎంఓయూ నా చేతుల్లో ఐదేళ్లున్నా..ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదు. అమ్మను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దనే ఈ వాస్తవాలు చెబుతున్నా’’ అంటూ షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News