జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను పట్టిచ్చే సమాచారాన్ని అందచేసిన వారికి రూ. 10 లక్షల బహుమానాన్ని ఎన్‌ఐఎ ప్రకటించింది. ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఏప్రిల్‌లో కాల్పుల ఘటనలో అన్మోల్ బిష్ణోయ్‌కు సంబంధం ఉందని అనుమానిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో చేర్చింది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న అన్మోల్ బిష్ణు అలియాస్ భాను తరచు అమెరికాకు ప్రయాణిస్తున్నట్లు గుర్తించింది. అక్లబోర్ 12న ముంబైలోని బాంద్రాలో మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ హత్య కేసులో కూడా అన్మోల్ బిష్ణోయ్ ప్రమేయం ఉన్నట్లు ఎన్‌ఐఎ ఆరోపిస్తున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల సంఘటనలో అన్మోల్‌తోపాటు అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్‌ను కూడా నిందితులుగా ఎన్‌ఐఎ పేర్కొంది. పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సమర్మతి జైలులో ఉన్నాడు.
అన్మోల్ బిష్ణోయ్ ఆచూకీ చెబితే రూ. 10 లక్షల బహుమతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -