దద్దమ్మ పాలనలో తెలంగాణ రాష్ట్ర ధర్నాలతో దద్దరిల్లుతున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన పాలనలో జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని ఎక్స్ వేదికగా విమర్శించారు. అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు, రైతు నుండి మొదలు రైస్ మిల్లర్ల వరకు..కార్మికుని నుండి మొదలు కాంట్రాక్టర్ల వరకు, టీచర్ల నుండి మొదలు పోలీస్ కుటుంబాల వరకు, అవ్వతాతల నుండి మొదలు ఆడబిడ్డల వరకు,
విద్యార్థుల నుండి మొదలు విద్యావంతుల వరకు, నిరుద్యోగులు మొదలు ఉద్యోగుల వరకు, కాంగ్రెస్ ప్రజాపతినిధుల నుండి మొదలు ప్రతిపక్ష నాయకుల వరకు…ఇలా ఒక్కరా ఇద్దరా ముగ్గురా మూలకున్న ముసలవ్వ మొదలు బడిపిల్లల దాక ధర్నాలు నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అడా ఈడా అంతటా ‘వద్దురా నాయన కాంగ్రెస్ పాలన’ అనే ఒకటే స్లోగన్ నడుస్తుందని విమర్శించారు. ముందు దగా- వెనక దగా..కుడి ఎడమల దగా .. దగా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చింది -కష్టాలు తెచ్చిందని అన్నారు.