Saturday, October 26, 2024

మంత్రి సురేఖపై కోర్టు సీరియస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కొండా సురేఖ త నపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖపై కోర్టు సీరియస్ అయ్యింది. మం త్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉ న్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మ హిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేర్కొంది. కెటిఆర్‌పై కొం డా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్‌గా పరిగణించింది. భవిష్యత్‌లో ఇంకెప్పుడూ కెటిఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చే యవద్దని కొండాను సురేఖను ఆదేశించింది. అ త్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ వ్యాఖ్యలను మీ డియా, సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, అన్ని సో షల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్

నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని, ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్‌లో ఉండవద్దని కోర్టు తెలిపింది. పరువు నష్టం కేసుకు సంబంధించిన ఓ కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారి.

కోర్టు ఆదేశాలను కొండా సురేఖ పాటించాలి : బిఆర్‌ఎస్ లీగల్ సెల్
కోర్టు ఆదేశాలను మంత్రి కొండా సురేఖ పాటించాలని బిఆర్‌ఎస్ లీగల్ సెల్ సభ్యులు లలితా రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ లీగల్ సెల్ సభ్యులు వేణు గోపాల్ రావు,జక్కుల లక్ష్మణ్,ప్రవీణ్,కావ్యశ్రీ భాస్కర్,కార్తీక్‌లతో ఆమె మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పైన మంత్రి కొండా సురేఖ అక్టోబర్ 2న అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆమె మంత్రి స్థాయిలో ఉండి వేరే మహిళలపై కామెంట్స్ చేశారని, మంత్రి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఆమెపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేశారని చెప్పారు. ఈ కేసులో కెటిఆర్ ఇప్పటికే కోర్టుకు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. కొండా సురేఖ మాట్లాడిన మాటల వీడియోలను, ఆర్టికల్స్‌ను యూట్యూబ్,గూగుల్ నుండి తొలగించాలని కోర్టు చెప్పిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News