- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగమవుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్.. కర్షక ద్రోహీ అని దుయ్యబట్టారు. పత్తి కొనుగోళ్లపై శనివారం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
“దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారు. తెల్లబంగారం తెల్లబోతున్నది.. బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కులేదు. కొర్రీలతో సీపీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేసింది. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదు.రైతు డిక్లరేషన్ బోగస్.. రైతులను కాంగ్రెస్ మోసం చేసింది” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -