Saturday, October 26, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్

- Advertisement -
- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఈ యాప్‌లో ఒకటి రెండు మార్పు చేర్పులను మంత్రి సూచించారు. మంత్రి సూచనల ప్రకారం యాప్‌లో కొన్ని మార్పులు చేసి వచ్చే వారంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంతవరకు వాడుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News