Saturday, November 23, 2024

భువనేశ్వర్ విమానాశ్రయంలో చిరుతను చూశానన్న మహిళ

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డంప్ యార్డ్ ప్రాంతం సమీపంలో ఒక చిరుతను చూసినట్లు ఒక మహిళ వెల్లడించడంతో ఒడిశా అటవీ శాఖ సిబ్బంది శనివారం దాని కోసం అన్వేషణ ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు. స్థానిక పోలీసులతో పాటు అటవీ శాఖ సిబ్బంది వలలు, ఇతర సాధనాలు పట్టుకుని ఆ ప్రాంతం అంతా గాలించారని, కానీ చిరుత ఆనవాలు ఏదీ కనిపించలేదని అధికారులు తెలిపారు.

డంప్ యార్డ్‌లో పని చేసే ఒక మహిళ అక్కడ ఒక చిరుతను చూశానని ఉదయం చెప్పినట్లు అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే. మిక్కిలి భద్రత ఉండే విమానాశ్రయ ప్రాంగణంలో అన్వేషణ కార్యక్రమంలో కేవలం నక్క పాద ముద్రలు కనిపించాయని, ‘కానీ చిరుత ఆనవాలు ఏదీ లేదు’ అని ఆయన చెప్పారు. 2019లో అటవీ శాఖ అధికారులు భువనేశ్వర్ విమానాశ్రయ ఆవరణలో ఒక చిరుతను పట్టుకుని, సమీపంలోని చందక అడవిలో వదలివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News