Sunday, October 27, 2024

రెండు చిన్న విమానాలు ఢీకొని ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాలో రెండు చిన్న విమానాలు శనివారం గగనంలోనే ఢీకొని సిడ్నీకి నైరుతి దిశగా ఒక అటవీ ప్రాంతంలో కూలిపోయినప్పుడు ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సిడ్నీకి నైరుతి దిశగా దాదాపు 55 మైళ్ల దూరంలోని ఒక సెమీరూరల్ అటవీ ప్రాంతంలో విమానాలు కూలిన ప్రదేశాలకు ఆస్ట్రేలియన్ పోలీస్, అగ్నిమాపక శాఖ, అంబులెన్స్ సిబ్బంది కాలినడకన చేరుకున్నారు. ప్రమాద పర్యవసానంగా ఒక విమానం మంటల్లో చిక్కుకున్నది.

ఇద్దరు వ్యక్తులతో వెళుతున్న సెస్నా 182 విమానం సమీపంలోని విమానాశ్రయం నుంచి ఒకరితో బయలుదేరిన ఒక తేలికరకం విమానాన్ని ఢీకొన్నదని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ ఏక్టింగ్ సూపరింటెండెంట్ తిమోతి కాల్మన్ ధ్రువీకరించారు. మృతుల వివరాలను వెల్లడించలేదు. ‘ఆకాశం నుంచి పతనం అవుతున్న శిథిలాలను’ ప్రత్యక్ష సాక్షులు చూసి, సాయం చేసేందుకు ప్రయత్నించారని, కానీ ‘అంతకు మించి చేసేందుకు ఏమీ లేకపోయింది’ అని కాల్మన్ ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఎబిసి)తో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News