Sunday, October 27, 2024

ఐఫోన్ 16పై నిషేధం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు షాక్ ఇస్తూ ఇండేనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండోనేషియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంస్థతో పాటు ఆ సంస్థ ఫోన్లు వాడే వినియోగదారులకుఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇండోనేషియా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటంటే, యాపిల్ విడుదల చేసిన తాజా మోడల్ ఐఫోన్ 16పై నిషేధం విధించడం. తమ దేశంలో ఆ ఫోన్ విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఐఫోన్ 16ను ఇతర దేశాల్లో కొనుగోలు చేసినా తమ దేశంలో వాడడంపైనా సర్కార్ నిషేధం విధించింది. ఇండోనేషియా పరిశ్రమల శాఖ మంత్రి గమివాంగ్ కర్తసస్మిత ఈ విషయం వెల్లడించారు. ఇండోనేషియాలో యాపిల్ ఐఫోన్ 16 వాడేండుకు ఐఎంఇఐ సర్టిఫికేషన్ లేదని మంత్రి తెలిపారు.

ఇంతకు ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందీ అంటే పెట్టుబడికి ఇచ్చిన హామీలను యాపిల్ నెరవేర్చకపోవడమేనని వార్తలు వినిపిస్తున్నాయి. యాపిల సంస్థ 1.71 మిలియన్ రూపాయలు (ఇండోనేషియా కరెన్సీ) పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. అయితే. 1.48 మిలియన్ రూపాయలు మాత్రమే పెట్టుబడులు పెట్టిందని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. యాపిల్ సంస్థ తమ హామీని అమలు చేయనందునే ఐఫోన్ 16పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి తెలిపారు. ఇండోనేషియాలో విక్రయించాలంటే 40 శాతం స్థానికంగా తయారు చేయాలన్న నిబంధన ఉందని, దానిని అందుకోవడంలో యాపిల్ విఫలం చెందడంతో ఈ పరిస్థితి నెలకొందని మంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News