Tuesday, December 3, 2024

వార ఫలాలు(27-10-2024 నుండి 02-11-2024) వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా లేదని చెప్పవచ్చు . ఏ విషయమైనా సరే ఆలోచించి ముందుకు సాగడం చెప్పదగిన సూచన . ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా రొటేషన్ బాగున్నాయి లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి.  విదేశీ వ్యవహారాలు అంతా అనుకూలంగా లేవని చెప్పవచ్చు . భాగస్వామి వ్యాపారాల్లో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది . సంతాన కోసం ప్రయత్నించిన వారికి సంతాన సాఫల్యం కలుగుతుంది . జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం అనుకూలిస్తాయి . విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది . విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. ఏ పని చేసినా దిగ్విజయంగా ముందుకు సాగుతారు.  ఆరోగ్యo కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది . ఏదైనా సరే మన సంకల్పంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి .  వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు, అన్ని చూసుకుని ముందుకెళ్లడం చెప్పదగిన సూచన .భాగస్వామ్య వ్యాపారాలు బాగుందని చెప్పవచ్చు . ఏ పని చేసినా సంతోషం కలిగించే విషయమని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి., నరదృష్టి అధికంగా ఉంది ఏ పని చేసిన పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగండి . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.

 

మిథునం:  మిధున రాశి వారికి ఈవారం బాగుందని చెప్పవచ్చు.  వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారపరంగా ఈ వారం బాగుంటుంది.  ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి.  ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది . ఉద్యోగరీత్యా కింది స్థాయి వాళ్ళతో మాట పట్టింపులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన.   గృహం కొనాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి .కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం సరైన సమయం కాదు .  విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా ,వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది . ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన . వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి . అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చదువుకుని సంతకం పెట్టడం చెప్పదగిన సూచన.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇంటా బయట తెలియని ఆందోళన చికాకు ఏర్పడుతుంది.  ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి.  సహ ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు . ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం పొందడానికి ప్రయత్నించండి. చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి.  వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అంత లాభంగా లేదని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన . కన్స్ట్రక్షన్ లో ఉన్నవారికి,  రియల్ ఎస్టేట్ వారికి,  అంత అనుకూలంగా లేదు . సినిమా , కళా రంగంలో వారికి ఈవారం బాగుందని చెప్పవచ్చు . అవార్డులు కానీ ఏదైనా రివార్డు కానీ వస్తాయి అనుకున్నప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. పేరు ప్రఖ్యాతలు మటుకు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి గడ్డుకాలం విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.  విదేశీ వ్యవహారాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి.  వీసా కి సంబంధించిన కొంత జాప్యం జరుగుతుంది . గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించిన వారికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి .ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అప్పు ఇచ్చేటప్పుడు అప్పు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి . వ్యాపారస్తులకు  అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.  మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి .విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వైద్య వృద్ధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెండింగ్ బిల్స్ వస్తాయి .మాట పట్టింపులు అనేవి ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమ వివాహ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది.

 

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం  మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి . ఏ పని చేసినా ముందుకు సాగుతుంది.  మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఎంతో కలిసి వస్తాయి . వివాహం కాని వారికి వివాహం సంబంధం కుదురుతుంది.  ఉద్యోగస్తులకు ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది . ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి  . భూ సంబంధిత విషయాల్లో క్రయవిక్రయాలలో జాప్యం జరుగుతుంది. విదేశీ వ్యవహారం వ్యవహారాలు అంతా అనుకూలంగా ఉండదు . భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి.  విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుంది అని చెప్పవచ్చు.  విదేశీ వ్యవహారాలు అంతగా అనుకూలించవు.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు . నూతన వస్త్రాలు, ఆభరణాలు లేదా వాహనం కొనే సూచన కనిపిస్తుంది.  ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. కళా రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.  వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ప్రధమార్ధం కంటే ద్వితీయార్థం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

తుల: తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  చేసే పనిలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  ఉద్యోగరీత్యా మంచి అనుకూలత లభిస్తుంది . ఏ పని చేసిన ముందుకు సాగుతుంది.  మీకున్న ధైర్య సాహసాలే మిమ్మల్ని నడిపిస్తాయి . విదేశాలకు వెళ్లాలనుకునే వారికి విదేశీ యోగ్యత లభిస్తుంది.  డాక్యుమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి . వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంది .  నూతన ఆలోచనలకు పదును పెట్టే సమయం అని చెప్పవచ్చు.  వ్యాపారంలో భాగస్వాములు కంటే మీదే పై చేయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేయగలుగుతారు. మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.  పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది . ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.  సమయానికి విశ్రాంతి తీసుకోవాలి.  విద్యార్థిని విద్యార్థులకు కలిసి వచ్చే కాలమని చెప్పవచ్చు . ఉద్యోగం కోసం ప్రయత్నించిన వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది.  దైవానుగ్రహంతో ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సినిమా రంగంలో ఉన్నవారికి బాగుందని చెప్పవచ్చు . అవార్డులు వచ్చే సూచనలు ఉన్నాయి.  కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు . సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.  ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉండడం వలన కాలభైరవ రూపు మెడలో ధరించడం చెప్పదగిన సూచన.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి .  ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి . మనోవేదన ఎక్కువగా ఉంటుంది . నరదృష్టి అధికంగా ఉండటం వలన పిల్లల ఆరోగ్యం కానీ, భాగస్వామి ఆరోగ్యం కానీ, చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది.  .ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా బాగుందని చెప్పవచ్చు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కొంచెం ఆలస్యం అయ్యే సూచన . ఉద్యోగం మారాలి అనుకునే వారికి కొంచెం నిరాశ ఎదురవుతుంది . విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు.  వ్యాపార పరంగా అన్ని విషయాలు మీరే చూసుకోవడం చెప్పదగిన సూచన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా చూస్తారు.  విద్యార్థిని విద్యార్థులకు బాగుందని చెప్పవచ్చు . విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విహారయాత్రలు గాని దైవదర్శనాలు కానీ చేసుకోగలుగుతారు.వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది.  ఉద్యోగస్తులకు స్థానచలనం కనిపిస్తోంది మొత్తం మీద ఈ రాశి వారికి ప్రధమార్ధం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈవారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి . వృత్తి , ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏ పనైనా నిదానంగా సాగుతుంది అనుకుంటారు కానీ అది ముందు ముందు మంచి ఫలితాన్ని లభిస్తాయి . స్పెక్యులేషన్ కి దూరంగా ఉండటం చెప్పదగినది . ఉద్యోగం మారే అవకాశం కనిపిస్తోంది . ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు  బాగుందని చెప్పవచ్చు . ఉద్యోగ పరంగా , వ్యాపార పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి.  ఎప్పటినుండి విదేశీయానం, తీర్థయాత్రలు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు .  జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా అవి మీ మంచికే అనుకోండి.  జీవిత భాగస్వామి సలహాలు  ఎంతో మేలు చేస్తాయి . ఈ రాశి వారు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రం పాటించడం చెప్పదగిన సూచన.

మకరం:   మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి  . ఉద్యోగ పరంగా చిన్నపాటి ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన.  వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి.  స్పెక్యులేషన్ కి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన . కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనిపిస్తుంది.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు   వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది . వ్యాపార నిమిత్తం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన.  సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మార్పులు అంతగా సంభవించవు. మానసిక అశాంతి , వ్యాపార పరంగా అన్ని బాగున్నాయి అనుకుంటాం కానీ నష్టాలు మాత్రం కనిపిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది . ఉద్యోగ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది . ఏం జరిగినా మన మంచికే అనుకుని ముందుకు సాగడం చెప్పదగిన సూచన.  వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం  బాగుందని చెప్పవచ్చు.  ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి . ఉద్యోగులకు ప్రమోషన్ లేదా నూతన ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం శుభ సమయం అని చెప్పవచ్చు . జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  గృహ నిర్మాణం వాహనం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటే పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వస్తాయి.  భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి .నూతనంగా వ్యాపారం ప్రారంభిస్తారు . లోన్లు విషయంలో కొంచెం జాగ్రత్త చెప్పదగిన సూచన . విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు . విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా ఇక్కడ చదువుకోవాలి అనుకునే వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  పాస్పోర్ట్ విషయంలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి .

­ మీనం: మీన రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  చేతిదాక వచ్చిన పనులు గాని,  ధనం గాని కొంచెం ఆలస్యం అయ్యే సూచన కనిపిస్తుంది.  దైవ అనుగ్రహాన్ని నమ్ముకుని ముందుకు సాగండి.   ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పాటించడం అనేది చెప్పదగిన సూచన.  ఉద్యోగస్తులుకు  ఉద్యోగ పరంగా బాగుందని చెప్పవచ్చు . ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి  ఉద్యోగం లభిస్తుంది . వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు . వ్యాపార వ్యవహార శైలిలో మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారు.  భాగస్వామ్య వ్యవహారాలు కలిసి వస్తాయి . వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యం జరిగే సూచన కనిపిస్తోంది . ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు  వ్యాపార పారంగా చిన్నచిన్న చిక్కులు ఉండే అవకాశం కనిపిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.  జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన .స్పెక్యులేషన్స్ కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన  . విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి . విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి.  హెచ్1బి వీసా కోసం ప్రయత్నించిన వారు ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వివాహం కాని వారికి వివాహం ప్రయత్నం చేసుకోవచ్చు. కష్టేఫలి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. సినిమా కళా రంగంలో వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగ వారికి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు.  మీ నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం చెప్పదగిన సూచన.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News