మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్ణయించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ తీర్మానించింది. ఈ యూనివర్సిటీకి ఎకరా రూ.250 చొప్పున 211 భూమిని మంత్రివర్గం కేటాయిస్తూ మంత్రివర్గం సమావేశం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 4 గం టల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి హైబ్రీడ్ అన్యూటీ మోడ్ అనే నూతన విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్‌ఎంసి) పరిధిలోని రో డ్లను రాష్ట్ర రహదారుల నిర్మాణానానికి ఇదే విధానం అ మలు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికన రహదారుల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణ యం తీసుకుంది. వచ్చే నాలుగేళ్లలో రహదారుల నిర్మాణానికి రూ.25 వేల నుంచి 28 వేల కోట్ల ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రహదారుల పిపిపి పద్దతిలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూ మిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ గా అప్‌గ్రేడ్ చేస్తూ మంత్రివర్గం సమావేశం నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్ సి గ్నల్ ఇచ్చింది. మూడు మెట్రో రైలు మార్గాలు నాగోల్ నుంచి ఎల్‌బినగర్, ఎల్‌బి నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు,ఎల్‌బినగర్ నుంచి
హయత్ నగర్‌కు, రాయదుర్గం నుంచి కోకాపేట, మియాపూర్ నుంచి రాయదుర్గం కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిపిపి పద్దతిలో మెట్రో విస్తరణకు రూ. 24,269 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదానికి పంపించాలని నిర్ణయించిం ది. మెట్రో విస్తరణతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు నగరవాసులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రెరాలో 54 ఉద్యోగాల భర్తీకి టిజిపిఎస్‌సికి ఆదేశాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రా ష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2 డి.ఎల చెల్లింపులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దీపావళి కానుకగా వెంటనే ఒక డి.ఎ చెల్లించనున్నట్లు మంత్రి ప్రకటించారు. మరో డి.ఎ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చెల్లించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న ఐదు డి.ఎలకు రెండు ఇవ్వడానికి మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. 317, 46 జిఒల వల్ల ఉద్యోగస్థులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ రెండు జిఒలకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా అసెంబ్లీలో చర్చించి సవరణకు కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. ఆ లోగా ఈ జిఇల వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించేందుకు పరస్పర బదిలీలు, ఆరోగ్య సమస్యలు, స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ఉద్యోగులందరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో ఇప్పటికే 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాలు ఉన్నాయని, మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ప్రకటించారు. దీపావళి తర్వాత నవంబర్ 1 లేదా 2వ తేదీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా వికారాబాద్, హుజుర్‌నగర్, మధిరలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
గచ్చిబౌలి స్టేడియంను స్పోర్ట్ యూనివర్సిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందన్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కడియం ప్రాజెక్ట్‌లో పూడికను తీయాలని కేబినెట్ నిర్ణయించిందని, తర్వాత ఇతర ప్రాజెక్టులకు కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. తాను చెప్పినట్లుగా దీపావళి టపాసులకంటే ముందే బాంబు పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీ లోపు సమగ్ర కులగణన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.కులగణనకు సంబంధించిన మార్గదర్శకాలపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోబోతున్నామని చెప్పారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపారు.