Sunday, October 27, 2024

మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్లు దోచుకుంటామంటే ఊరుకోం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని.. కానీ మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి లక్షన్నరకోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోమని కెటిఆర్ హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టు మాటున కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి మూటలు పంపి, తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేదాకా ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడుతమని అన్నారు. పేదల ఇండ్లు కూలగొట్టి షాపింగ్ మాల్స్ కట్టేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నాడని.. మీ ఇంటిపైకి బుల్ డోజర్లు వస్తే తనతో సహా పార్టీ నాయకులందరూ వాటి ముందు పడతామని అన్నారు.

శనివారం ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారంలో పర్యటించిన కెటిఆర్.. పెద్ద చెరువు ఎస్టిపిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపడం రాదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులను పోలీసులు కొడుతున్నారని… ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కేవలం 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు తీసుకువస్తే మూసీ సుందరీకరణ పూర్తి అవుతుందని.. కానీ ఈ ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలు చెబుతూ అవినీతి కోసం కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News