Saturday, November 23, 2024

ఏటా లక్ష ఎకరాల్లో పామాయిల్‌ సాగే లక్ష్యం: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో తుమ్మల మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “ఇటీవల తన మలేషియా పర్యటన వివరాలు వెల్లడించారు. మలేషియాలో ఆయిల్‌పామ్‌ సాగే ప్రధాన పంట. మలేషియా కంటే మనవద్దే సారవంతమైన భూములున్నాయి. ప్రభుత్వం సాయం చేస్తే పామాయిల్‌ను అధికంగా సాగు చేయవచ్చు. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్ష ఎకరాల్లో పామాయిల్‌ సాగే లక్ష్యం” అని చెప్పారు. అలాగే, అశ్వారావుపేట రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరికీ అన్యాయం జరగకూడదని, భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న దమ్మపేట ఎస్ఐపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News