- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనగణన చేపట్టబోతున్నది. ఈ ప్రక్రియ 2026 వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత లోక్ సభ స్థానాల విభజన (delimitation) ప్రక్రియ ప్రారంభం కానున్నది. కోవిడ్ తర్వాత జనగణన ప్రక్రియ చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చినా వాయిదా వేస్తూ వచ్చారు. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తగిన సమయంలో జనగణన నిర్వహిస్తామన్నారు. కాగా ఈసారి డిజిటల్ సర్వే ఉంటుందన్నారు. గత ఏడాది ఏప్రిల్ లో భారత జనాభా చైనా జనాభాను అధిగమించిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. చైనా జనాభా కన్నా భారత జనాభా 2 కోట్లు అధికంగా ఉందని అంచనా. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
- Advertisement -