- Advertisement -
ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మాలపాడ్‌లో చోటుచేసుకుంది.మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన యువతిని రంజిత్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రాత్రి పుల్కల్‌కు వెళ్లిన రంజిత్ యువతితో చనువుగా ఉండటం చూసిన ఆమె కుటుంబ సభ్యుల దాడి చేశారు. దీంతో అవమాన భారంతో సింగూరు బ్యాక్ వాటర్‌లో దూకి రంజిత్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, యువతి కుటుంబసభ్యులే రంజిత్ ను కొట్టి చంపారని అతని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -