- Advertisement -
నలుగురు మహిళా అభ్యర్థులను పోటీకి నిలిపింది
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి) తన అభ్యర్థుల మూడో జాబితాను సోమవారం విడుదల చేసింది. ఆ జాబితాలో 25 మంది అభ్యర్థులను పేర్కొంది. బిజెపి తన తొలి జాబితాలో 99 మంది పేర్లను, రెండో జాబితాలో 22 మంది పేర్లను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. బిజెపి ఇప్పటి వరకు 146 మంది అభ్యర్థులను పేర్లను ప్రకటించింది.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్ సిపి చీఫ్ అజిత్ పవార్ శుక్రవారం 288 అసెంబ్లీ సీట్లలోని 11 సీట్ల విషయంలో మహాయుతి మిత్రపక్షాలు ఇప్పటికీ చర్చలు జరుపుతున్నాయని అన్నారు.
- Advertisement -