దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(జెఇఇ) 2025 ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ప్రకటించింది. 2025 జనవరి 22 నుంచి 31 వరకు మొదటి విడత, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ వెల్లడించింది. జెఇఇ మెయిన్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే రెండు విడతల్లో జెఇఇ మెయిన్ నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. తొలి విడత జెఇఇ మెయిన్ పరీక్షల దరఖాస్తుల ప్రక్రియ సోమవారం(అక్టోబర్ 28) నుంచి నవంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. 2025 ఫిబ్రవరి 12వ తేదీన మొదటి విడత జెఇఇ మెయిన్ పరీక్షలు ఫలితాలు విడుదలవుతాయని వెల్లడించించింది.
జెఇఇ మెయిన్ 2025 పరీక్షల షెడ్యూల్
జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలు 2025 జనవరి 22 నుంచి 31 వరకు
దరఖాస్తుకు చివరి తేదీ 2025 నవంబర్ 22
ఫలితాలు 2025 ఫిబ్రవరి 12
జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు 2025 ఏప్రిల్ నెలలో