మన తెలంగాణ/పంజాగుట్ట:- చౌక ధరకు అమ్ముతున్నారన్న ఆశతో సం త కు వచ్చిన వారినే కాకుండా చుట్టు పక్కల ఉన్న బస్తీ వాసులను ఆకట్టుకున్నాయి ఆ మోమోస్, అంతే అక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని సైతం పట్టించుకోకుండా యువకులు, మధ్య వయస్కులు, మహిళలు పెద్ద యెత్తున కొనుగోలు చేసి తిన్నారు. కాని ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే తిన్న మోమోస్ విష ఆహారంగా మారాయి. తీవ్ర స్థాయిలో వీరోచనాలు, వాంతులు, కడుపు నొ ప్పి రావడంతో ఆసుపత్రులకు పరుగులు తీశారు. సుమారు 50 మంది అస్వస్థతకు గురి కాగా ఓ గృహిణి మృతి చెందింది. అలస్యంగా వెలుగులోకి వ చ్చిన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీసుస్టేషన పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని నందినగర్, సింగాడికుంట బస్తీలో ప్రతి శుక్రవారం కూరగాయల సంత ఏర్పాటు చేస్తారు. 25న కూడ సంత పెట్టారు. ఢిల్లీ మెమోస్ పేరిట ప్రతి వారం సంతలోనే మోమోస్ అమ్మే షాపు నిర్వహిస్తున్నాడు. ఎప్పటి మా దిరిగానే మెమోస్ తి నేందుకు చాలా మంది ఎగబడ్డారు. సమీపంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా పట్టించుకోకుండా తినేశారు. అ యితే ఇంటికి వెళ్లాక మోమోస్ తిన్న వారి లో వాంతులు, వీరోచనాలు మొదలయ్యాయి. కొంతమంది తీవ్ర మైన కడుపు నొప్పితో విలవిలలాడారు. ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు వాంతులు, వీరోచనాలతో బాధపడుతున్న వారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఒకరి మృతితో అసలు విషయం వెలుగులోకి….
ఎవరికి వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం వల్ల అసలు సమస్య తెలియలేదు. కాగా సింగాడికుంట బస్తీకి చెందిన రేష్మాబేగం ఆమె కుమార్తెలు రుష్మా, రఫీయా, కుమారుడు అబ్దుల్ రెహ్మాన కూడా తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డారు. మెడికల్ షాప్‌లు టాబ్లెట్‌లు తెచ్చి వాడినా మెరుగు పడలేదు. శనివారం వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా రేష్మాబేగం మరణించింది. ఆమె మృతికి గల కారణం తెలియకపోవడంతో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించారు. అయితే రేష్మా మరణం బస్తీలో అందరికి సందేహాలు కలిగించాయి. వాకబు చేయగా మెమోస్ తినడం వల్లే అని తేలింది. ఇంతలో ఢిల్లీ మెమోస్ వద్ద కలుషిత ఆహారం తిని తన కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారని నందినగర్‌కు చెందిన ఓ కూరగాయల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇవన్ని పరిశీలించగా నందినగర్, సింగాడికుంట బస్తీ, ఇబ్రహీంనగర్, గౌరీశంకర్ కాలనీకి చెందిన సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయినట్టు తేలింది. వీరంతా నందినగర్, సింగాడికుంట సంతలో మెమోస్ తినడం వల్లే అని నిర్ధారణ అయింది. బాధితులు ఇంకా తన్వీర్, ద్వారకామయి క్లీనిక్, రిలీఫ్ ఆసుపత్రి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఢిల్లీ మెమోస్ నిర్వాహకులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సింగాడికుంటలో అమ్మింది సాజిద్ హుస్సేన్, నందినగర్‌లో సాదిక్ అమ్మకాలు చేసినట్టు గుర్తించారు. నాసి రకం మెమోస్ వల్లే ఆహారం కలుషితం అయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా చింతల్‌బస్తీలో ఉన్న ఢిల్లి మెమోస్ తయారీ కేంద్రాన్ని జిహెచఎంసి అధికారులు సోమవారం సీజ్ చేశారు. అక్కడ ఉన్న ఆహార పదార్ధాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.