Monday, December 23, 2024

రాజ్ పాకాలకు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జన్వాడ ఫా మ్‌హౌజ్ కేసులో రాజ్ పాకాలకు హైకోర్టులో సో మవారం ఊరట లభించింది. రెండు రో జుల వరకు రాజ్‌పాకాలను అరెస్టు చేయవద్ద ని పోలీసులను కోర్టు ఆదేశించింది. అలా గే పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని కూ డా మరోవైపు రా జ్ పాకాలను హైకోర్టు ఆదేశించింది. పోలీసుల దర్యాప్తులో లోపా లు ఉ న్నట్టు రాజ్ పాకాల తరఫు న్యా యవాది కో ర్టుకు నివేదించడంతో రెండు రో జుల పాటు అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశిస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసిం ది. జన్వాడ ఫా మ్ హౌస్‌లో రాజ్ పాకాల ముందస్తు అనుమతి లేకుండా విందు ఏర్పా టు చేయడం, ని బంధనలకు మించి డ్యూటీ చెల్లించని విదేశీ మద్యం వినియోగించడం, అక్కడ జరిగిన విందులో ఒక వ్యక్తి డ్రగ్స్ తీ సుకున్నట్టు పోలీసులు ఏ 1గా రాజ్ పాకాలపై పోలీసులు, ఎక్సైజ్‌శాఖలు వేర్వేరుగా కేసులు న మోదు చేయడంతో, తనను అరెస్టు చేయవద్దని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్‌లో దాఖలైన ఈ పిటిషన్‌పై హైకోర్టు అటు పోలీసులకు, ఇటు రాజ్ పాకాలకు ఇరు పక్షాలకు ఆదేశాలు జారీ చేసింది. తనను పో లీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్ర యత్నం చేస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని రాజ్ పాకాల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ చేపట్టిన

ధర్మాసనం, పోలీసుల ఎదుట హాజయ్యేందుకు ఆయనకు (రాజ్ పాకాల) రెండు రోజుల వ్యవధి హైకోర్టు ఇచ్చింది. బాధితుడు రాజ్ పాకాల తరఫున మయూర్‌రెడ్డి వాదనలు వినిపించగా, తన నూతన గృహ ప్రవేశాన్ని పురస్కరించుకొని బంధువులకు, స్నేహితులకు విందు ఏర్పాటు చేయగా పోలీసులు అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించి తప్పుడు కేసు బనాయించారని రాజ్ పాకాల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. నిందితుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బావమరిది కావడంతో అధికార పార్టీ పెద్దల రాజకీయ కక్షసాధింపుతో తప్పుడు కేసు నమోదు చేసినట్టు న్యాయవాది వివరించారు. అక్కడ జరిగిన విందులో డ్రగ్స్ లభించలేదని ఇద్దరు ఎక్సైజ్ అధికారులు మీడియాకు వెల్లడించిన వివరాలను కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. అక్కడ జరిగిన విందులో ఒక వ్యక్తికి డ్రగ్స్ సేవించినట్టు పరీక్షలో తేలితే, పోలీసులు రాజ్ పాకాలను నిందితు డిగా చేర్చారని కోర్టుకు వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని, సోమవారం ఉదయం 9.30కి నోటీసులు పంపించి 11 గంటలకు విచారణకు రమ్మన్నారని కోర్టు దృష్టికి తీసుకవచ్చారు.

పోలీసుల తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ తన వాదనలు వినిపిస్తూ, అరెస్టు చేస్తామని పోలీసులు ఎక్కడా చెప్పలేదని, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని కోర్టు వివరించారు. ఈ వి్ందదులో అనుమతి లేని మద్యం, నిబంధనలకు మించి మద్యం సీసాలు లభించడంతోపాటు విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందని ఆయన వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, నిబంధనల ప్రకారమే రాజ్ పాకాలకు 41ఎ కింద నోటీసులు ఇచ్చామని వివరించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు పిటిషనర్‌కు రెండు రోజుల గడువు ఇచ్చింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ…
కాగా, బిఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫాంహౌస్ పార్టీకి సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసుల్లో పోలీసులు వెల్లడించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అడ్రస్ ప్రూఫ్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులో వెల్లడించారు. సోమవారం మోకిలా పోలీసుస్టేషన్‌కు హాజరు కాకుంటే బిఎన్‌ఎస్‌ఎస్35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని నోటీసులో వెల్లడించారు. రాజ్ పాకాలకు మోకిలా ఇన్‌స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు. రాజ్ పాకాల ఇంటి గోడకి నోటీసును అతికించారు. అయితే బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3) కింద కేసు నమోదు చేసి 311/2024 ఎఫ్‌ఐఆర్ అండర్ సెక్షన్ 25,27,29 ఎన్డీపిఎస్ యాక్ట్ 1985, సెక్షన్ 3,4 తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు రాజ్ పాకాలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News