Thursday, January 2, 2025

వేలానికి రాహుల్?

- Advertisement -
- Advertisement -

స్టార్ ఆటగాడిని వదులుకోనున్న లక్నో సూపర్ జెయింట్స్
లక్నో: టీమిండియా బ్యాటర్ కెఎల్ రాహుల్ గత కొంతకాలంగా పేలవ ప్రదర్శ చేస్తున్న సంగతి తెలిసిందే. అవకాశాలు వస్తున్నా బ్యాట్‌లో రాణించలేక తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలో రాహుల్ ప్రతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి రిటెన్షన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జట్టు కొత్త సారధిని సయితం ఎంపిక చేసుకుందనే సమచారం. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లతో పాటు ముగ్గురు స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోనుంది. అక్టోబర్ 31వ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది.నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. కాగా, లక్నో ఫ్రాంచైజీ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మోహ్షిన్ ఖాన్, ఆయుష్ బదోని రిటైన్ చేసుకోవడానికి నిర్ణయించుకుంది. ఇక నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు వెచ్చించి తీసుకోనుంది.

అంతేగాక నికోలస్ పూరన్ సారథి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. మార్కస్ స్టొయినిస్‌ను రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత కొంతకాలంలో టీ20ల్లో పూరన్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డులు కూడా బద్దలుకొడుతున్నాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్‌గానూ సత్తాచాటే పూరన్ రిటైన్ లిస్ట్‌లో తమ ప్రథమ ఎంపికగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కాగా, రాహుల్ వేలంలోకి రానుండటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ వ్యూహాలు మొదలుపెట్టింది. రాహుల్‌ను దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News