- Advertisement -
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తొలి దశలో స్క్రూటినీ అనంతరం 746 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారి మంగళవారం తెలిపారు. స్క్రూటినీలో 62 మంది ఆశావహుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఆయన చెప్పారు. నవంబర్ 13న తొలి దశలో 43 అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగగా 43 అసెంబ్లీ స్థానాల కోసం మొత్తం 805 మంది ఆశావహులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్క్రూటినీ అనంతరం మొత్తం 743 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారని, బుధవారం వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని ఇక్కడి సిఇఓ కార్యాలయం అధికారి ఒకరు తెలిపారు. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీలలో రెండు దశలలో పోలింగ్ జరగనున్నది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
- Advertisement -