Monday, December 23, 2024

టైగర్ రిజర్వ్‌లో ఏడు ఏనుగుల మృతి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో ఏడు ఏనుగులు మరణించడం సంచలనం సృష్టించింది. మరో మూడు ఏనుగులు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నాయి. ఏకకాలంలో ఏడు ఏనుగులు మరణానికి దారితీసిన కారణాలపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీకి చెందిన వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తునకు ఆదేశించాయి. మరణించిన ఏనుగులకు జబల్‌పూర్‌లోని స్కూల్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్ అండ్ హెల్త్‌లో పోస్టుమార్టం జరుగుతోందని, ఏనుగుల మరణానికి కారణాలు దీని ద్వారా తెలియవచ్చని వర్గాలు తెలిపాయి.

రైతులు తమ పంటలపై క్రిమిసంహారకాలను పిచికారీ చేశారని, ఏనుగుల మరణానికి ఇది కూడా కారణం కావచ్చని వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నిత్యం జరిగే పెట్రోలింగ్ సందర్భంగా సిబ్బందికి మంగళవారం రెండు ఏనుగుల మృతదేహాలు లభించాయని, కొద్ది దూరంలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఐదు ఏనుగులు కనిపించాయని వర్గాలు తెలిపాయి. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన పులుల మరణాలు సంచలనం సృష్టించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News