గ్రూప్ -3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనుండగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్ -2 నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 18న పేపర్ 3 పరీక్షను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహిస్తారు. నవంబర్ 10న హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. గ్రూప్ 3 పరీక్ష మొదటి సెషన్‌కు ఉదయం 8.30గంటల నుంచి,
రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30గంటల లోపే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 9.30గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30గంటలకు గేట్లు మూసివేస్తామని, ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పారు. సెలక్షన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, క్వశ్చన్‌పేపర్లు జాగ్రత్త చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డూప్లికేట్ హాల్ టికెట్లను తర్వాత జారీ చేయబోమని స్పష్టం చేసింది. తెలంగాణలో 1388 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా గ్రూప్ -3 పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 10 నుంచి https//www.gov.in లో అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.