Friday, November 1, 2024

అణు పరీక్షకు ఉత్తర కొరియా సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

ఉత్తర కొరియా తన ఏడో అణు పరీక్షకు సన్నాహాలు పూర్తి చేసిందని, నవంబరులో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని దక్షిణ కొరియా పేర్కొంది. ఈమేరకు తమ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చట్టసభ సభ్యులకు వివరాలు అందజేసినట్టుగా తెలిపింది. అమెరికా లోని లక్షాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణిని పరీక్షించేందుకు ఆ దేశం సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది. ఉత్తర కొరియా ఈశాన్య పట్టణం పుంగ్గేరి లోని టెస్టింగ్ గ్రౌండ్‌లో అణుపరీక్షను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసిందని టన్నెల్ నంబర్ 3 వద్ద పేలుడు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా రష్యాకు పంపిన వేల మంది సైనికులను రష్యా లోని కుర్క్ ప్రాంతంలో ఇప్పటికే మోహరించిందని, ఇదంతా చూస్తుంటే యుద్ధానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News