రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు దీపావళి పండగపూట శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గురుకుల, హాస్టల్స్ విద్యార్థులకు మేలు చేకూరేలా రేవంత్ రెడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల గురుకులాలు, పలు సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాల్లోని విద్యార్థుల కాస్మోటిక్స్, డైట్ చార్జీలను పెంచింది. ప్రస్తుతం 3 నుంచి 7వ తరగతి వరకు ఉన్న డైట్ ఛార్జీలు రూ.950 ను రూ.1330కి పెంచారు.
8 నుంచి 10వ తరగతి వరకు రూ. 1100 నుంచి రూ. 1540 కి పెంచారు. ఇక ఇంటర్ నుండి పీజీ వరకు రూ. 1500 నుంచి రూ. 2100 కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాస్మోటిక్ ఛార్జీలు 3 నుంచి 7వ తరగతి వరకు ప్రస్తుతం రూ.55 ఉండగా దానిని రూ. 175కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ. 275 వరకు పెంచారు. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,65,700 మంది హాస్టల్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.