Saturday, November 23, 2024

టిటిడికి కొత్త పాలకమండలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అమరావతి : తిరుమల తి రుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా టీవీ 5 అధినేత బీఆర్ నా యుడు నియమితులయ్యారు. 24 మంది స భ్యులతో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కా నుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకట న విడుదల చేసింది. బోర్డులో తెలంగాణ నుంచి ఐదుగురికి స్థానం కల్పించగా తమిళనాడు నుంచి ఇద్దరు, కర్నాటక నుంచి ఇద్దరి కి చో టు కల్పించారు. కాగా జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే), ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే), పనబాక లక్ష్మి (కేం ద్ర మా జీ మంత్రి), జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ), శ్రీసదాశివరావు నన్నపనేని కృష్ణమూర్తి ( తమిళనాడు), కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్. ఆర్. ఎన్ (కర్ణాటక), జస్టిస్ హెచ్‌ఎల్ దత్

(కర్ణాటక),శాంతారామ్,పి.రామ్మూర్తి (తమిళనా డు), జానకీ దేవి తమ్మిశెట్టి, బూంగునూ రు మహేందర్‌రెడ్డి (తెలంగాణ), అనుగోలు రంగశ్రీ(తెలంగాణ), బూరగాపు ఆనంద సాయి(తెలంగాణ), సుచిత్ర ఎల్ల(తెలంగాణ), నరేశ్‌కుమార్ ( కర్ణాటక), డా.అదిత్ దేశాయ్ (గుజరాత్) శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర) సభ్యులు గా నియమితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ( 72 సం) నియమితులయ్యారు. టీవీ5 చైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన బిఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్దతకూ ప్రతీక. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ స్పృహ ఉన్న పౌరుడిగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిటిడి బోర్డు చైర్మన్ గా బిఆర్ నాయుడు నియామకాన్ని ఆమోదించి అభినందనలు తెలిపారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బి ఆర్ నాయుడు చిన్నతనం నుంచి పట్టుదల స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బి ఆర్ నాయుడు చిన్నతనం నుంచి ఏదో సాధించాలన్న తపనతో కృషి చేసేవారు. స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విధ్య నేర్చుకొని బీహెచ్‌ఈఎల్ – హైదరాబాదులో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బీహెచ్‌ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చాలా చురుకుగా పనిచేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బిహెచ్‌ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగుల తరఫున సాహిత్య సాంస్కృతిక అంశాలపై ఒక ప్రత్యేక పక్ష పత్రిక కూడా నడిపారు. ఉద్యోగుల సంక్షేమం, ఇతర అంశాలపై కూడా చాలా సామాజిక స్పృహతో మెలిగేవారు. బి ఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్‌ఈఎల్ లోనే పనిచేశారు. బిహెచ్‌ఇఎల్ లో పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని బలంగా కోరుకున్నారు.

ఎన్టీఆర్ మొదటి సారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించేందుకు జరిగిన ప్రయత్నాలను బీఆర్ నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కొనసాగాలని కోరుతూ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరున జరిగిన భారీ సభలు, ర్యాలీలు నిర్వహించిన సమయంలోనే బి.ఆర్ నాయుడు శక్తి వంచన లేకుండా చేసిన కృషితో చంద్రబాబు నాయుడుకు దగ్గరయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ స్థానికంగా ప్రజా ప్రతినిధిగా కూడా పనిచేశారు. నిరంతర కృషివలుడైన బీఆర్ నాయుడు తర్వాత తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వ్యాపార రంగంలో ప్రవేశించారు. ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బిఆర్ నాయుడు అంచలంచెలుగా ఎదుగుతూ తర్వాత టీవీ5, హిందూ ధర్మం, న్యూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు. స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడైన బీఆర్ నాయుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించేలా హిందు ధర్మ ప్రచార నిమిత్తం హిందూ ధర్మం పేరుతో 2018లో ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక ఛానల్ స్థాపించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివిధ క్షేత్రాల మహాత్యాలు, దేశంలోని పీఠాధిపతుల ప్రబోధాలను హిందూ ధర్మం ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను హిందూ ధర్మం ద్వారా తెలుగు ప్రజలకు చేరువచేసే ప్రయత్నం బీఆర్ నాయుడు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News