Friday, November 22, 2024

జనసేన కార్యకర్త వద్ద డబ్బులు డిమాండ్ చేసిన ఎంఎల్ఎ పంతం నానాజీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ సొంత పార్టీ కార్యకర్తల దగ్గరే డబ్బులు డిమాండ్ చేశారు. కాకినాడలో ఓ స్థలం వివాదంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆ పార్టీ కార్యకర్త ఆకుల బాలరాజు ఆరోపించారు. డబ్బులు ఇవ్వనందుకు తాము కట్టుకున్న షాపును అధికారాన్ని ఉపయోగించి కూల్చి వేశారని మండిపడ్డారు. పంతం నానాజీ, వైసిపి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బంధువు సత్తిరెడ్డికి అనుకూలంగా ఉన్నాడని బాలరాజు ఆరోపణలు చేశారు. 2000వ సంవత్సరంలో 107 సర్వే నంబర్ లో 260 గజాలు కొన్నానని, మూడు నెలల క్రితం ఇల్లు నిర్మించుకున్నామని, పంచాయతీ ఇప్పటివరకు పర్మిషన్ తీసుకోలేదని బాలరాజు తెలిపారు. తమకు నోటీసులు ఇవ్వకుండా తన ఇల్లును కూల్చివేశారని బాధితుడు ఆరోపణలు చేశాడు. తన ఇంటి వెనక ఉన్న సత్తి రెడ్డి పేరు మీద ఉందని, ఆ డాక్యుమెంట్లులో బాధితుడి పేరు ఉందని, పది లక్షల రూపాయలు ఇస్తే మీ ఇంటిని వదిలేసి మా స్థలం అమ్ముకుంటామని సత్తిరెడ్డి, స్థానిక ఎంఎల్ఎ పంతం నానాజీ బెదిరించాడని బాలరాజు ఆరోపణలు చేశాడు. తన ఇంటి వెనుక స్థలం సత్తిరెడ్డి 2007లో  కొన్నాడని,  ఇక్కడ ఉన్న స్థలం మొత్తం అమ్మేస్తున్నామని, పది లక్షల రూపాయలు ఇస్తే మీ ఇంటిని వదిలేసి మిగితా స్థలం అమ్మేస్తామని బెదిరింపులకు దిగారని బాధితుడు ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News