Friday, November 1, 2024

తునిషియా నుంచి వంతారాకు మూడు ఆఫ్రికన్ ఏనుగులు

- Advertisement -
- Advertisement -

జామ్ నగర్: మూడు ఆఫ్రికన్ ఏనుగులను తునిషియా నుంచి భారత్ లోని జామ్ నగర్ కు విమానంలో తీసుకొచ్చారు. మూడు ఏనుగులను తరలించడానికి రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ సహాయం చేశాడు. మూడు ఏనుగులను ఆయన తన వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాకు తరలించారు.  మూడు ఏనుగులను తునిషియాలోని ఫ్రిగుయా ఫార్ నుంచి వంతారాకు విమానంలో తరలించారు. తునిషియాలో వాటికి సరైన సదుపాయాలు లేకపోవడంతో అక్కడి సిబ్బంది అనంత్ అంబానీని సంప్రదించారు. దీంతో మూడు ఏనుగులను విమానంలో తరలించడానికి అనంత్ అంబానీ ఏర్పాట్లు చేశాడు. రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్  అనంత్ అంబానీ వంతారా అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని జామ్ నగర్‌లో ఏర్పాటు చేశాడు. మూడు వేల ఎకరాలలో దీని ఏర్పాటు చేయడంతో పాటు జంతువుల సంరక్షణ కోసం మూడు వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు.

ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఓ ఆస్పత్రిని కూడా నిర్మించారు. ఏనుగులకు అత్యాధునిక వసతులు, శ్రాస్త్రీయంగా రూపొందిచిన ఎన్‌క్లోజర్‌లు, హైడ్రోథెరపీ, ఏనుగులకు ఆర్థరైటిస్ చికిత్స కోసం ప్రత్యేకంగా కొలనులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న 200 మంది నిపుణులు ఏనుగులను సంరక్షిస్తున్నారని వంతారా అధికారి తెలిపారు. వంతారాలో వందకు వివిధ రకాల చెందిన జాతులకు సంబంధించని వన్య ప్రాణులు ఉన్నాయి. వంతారా జంతు సంరక్షణ కేంద్రం ఇంటర్ నేషనల్ యూనియన్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్‌తో కలిసి చేస్తుంది. ఇప్పటి వరకు 200 ఏనుగులకు పైగా రక్షించింది. వంతారా అనేది జూ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేయాలని లక్ష్యాలను పెట్టుకుంది. భారత దేశంలో 150కి పైగా జంతు ప్రదర్శన శాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ జీవన వైద్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని వంతారా అడుగులు వేస్తోంది.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News