Saturday, November 2, 2024

హస్తినకు కాలుష్యం కాటు

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్ర వేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా గురువారం రాత్రి ఢిల్లీ వ్యాప్తంగా పేలిన బాణసంచాతో నగరంలో కాలుష్యం భయంకరంగా పెరిగిపోయింది. బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ ఎవ్వరూ లెక్క చేయలేదు. ఫలితంగా ఢిల్లీపై కాలుష్యం దుప్పటిలా పరచుకుంది దీనితో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత సూచి (ఎక్యు) రికార్డు స్థాయిలో 359 దాటేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు తూర్పు, పశ్చిమ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బాణసంచా కాల్చి పండుగ జరుపుకున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) గణాంకాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయానికి బురారి క్రాసింగ్‌లో 394,

జహంగీర్‌పురిలో 387, ఆర్‌కె పురంలో 375, రోహిణిలో 385, అశోక్ విహార్‌లో 384, ద్వారక సెక్టార్‌లో 375, ఐజిఐ ఎయిర్‌పోర్ట్‌లో 375, మందిర్ మార్గ్‌లో 369, పంజాబీ బాఘ్‌లో 391, ఆనంద్ విహార్‌లో395, సిరి ఫోర్ట్‌లో 373, సోనియా విహార్‌లో 392గా గాలి నాణ్యత నమోదైంది. గాలి నాణ్యతలో ఇది అత్యంత నాసిరకం. గురువారం రాత్రి ఒంటి గంట తరువాత గాలిలో నాణ్యత క్రమంగా తగ్గిపోయింది. ఢిల్లీ వాసులు నిషేధాన్ని పక్కన పెట్టి బాణసంచా కాల్చడంతో అనేక ప్రాంతాల్లో 2.5గా స్థాయిలు ఆ తరువాత ఘనపు మీటర్‌కు 900 మైక్రోగ్రాములు వరకు పెరిగింది. ఇది ఆమోదయోగ్యమైన పరిమితి కంటె 15 రెట్లు అధికం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News