Sunday, December 22, 2024

కోదాడలో బస్సును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

- Advertisement -
- Advertisement -

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టకొమ్ముగూడె వద్ద జాతీయ రహదారిపై ఆర్ టిసి బస్సును వెనక నుంచి ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయ కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News