- Advertisement -
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 59.4 ఓవర్లలో 263 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టు ఇప్పటి వరకు 28 పరుగుల ఆధిక్యంలో ఉంది. అజాజ్ పటేల్ ఐదు వికెట్లు తీసి టీమిండియా నడ్డివిరిచాడు. శుభ్మన్ గిల్ 90 పరుగులతో అదరగొట్టగా రిషబ్ పంత్ 60 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్మెన్లు యశస్వి జైస్వాల్(30), వాషింగ్టన్ సుందర్(38, నాటౌట్), రోహిత్ శర్మ(18), రవీంద్ర జడేజా(14), రవిచంద్రన్ అశ్విన్(06), సర్ఫరాజ్ ఖాన్(0), మహ్మద్ సిరాజ్ (0), ఆకాశ్ దీప్(0) పరుగులు చేసి నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు తీయగా మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధీ తలో ఒక వికెట్ తీశారు.
- Advertisement -