Friday, November 22, 2024

వర్శిటీల ప్రక్షాళన తప్పదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని యూనివర్శిటీలను నూటికి నూరుశాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యా మండలికి, వైస్ చాన్సలర్లకు సూచించారు. ఉన్నత వి ద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి పేర్కొన్నారు. యూనివర్శిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలని, అలాంటి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సిఎం సూచించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డితో పాటు అన్ని యూనివర్శిటీల వైస్‌చాన్సలర్లు ముఖ్యమంత్రితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యామండలి చైర్మన్, విసిలకు సిఎం దిశానిర్ధేశం చేశా రు. ఎవరి ప్రభావితంతో వైఎస్ చాన్సలర్ పోస్టులను ఎం పిక చేయలేదని, మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక జరిగిందని, బాగా పని చేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఆయన సూచించారు. కొంతకాలంగా యూనివర్శిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, తిరిగి వర్శిటీల
గౌరవం పెంచే దిశగా పని చేయాలని సిఎం రేవంత్ సూచించారు.

యూనివర్శిటీప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయాలి
గతంలో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలని సిఎం సూచించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని, మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్‌లకు స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్లు ప్రొ. ఎం.కుమార్ (ఉస్మానియా), ప్రొఫెసర్లు ప్రతాప రెడ్డి (కాకతీయ), జిఎన్ శ్రీనివాస్ (పాలమూరు), నిత్యానం ద రావు (తెలుగు), అల్తాఫ్ హుస్సేన్ (మహాత్మాగాంధీ), యాదగిరి రావు (తెలంగాణ), అల్దాస్ జానయ్య (జయశంకర్ వ్యవసాయ), రాజిరెడ్డి (కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్శిటీ), ఉమేష్ కుమార్ (శాతవాహన), సూర్య ధనుంజయ (మహిళా వర్శిటీ), గోవర్దన్ (బాసర ఐఐఐటీ) ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News