Monday, December 23, 2024

భక్తులకు గుడ్ న్యూస్.. కార్తీక మాసంలో ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టిజిఎస్‌ఆర్‌టిసి ఎండి, విసి సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఆర్‌టిసి పనితీరు, కార్తీకమాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి శనివారం వర్చవల్‌గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌టిసికి కార్తీక మాసం, శబరిమల ఆపరేషన్స్ ఎంతో కీలకమని, భక్తుల అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను tgsrtcbus.in వ్బ్సైట్లో చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఆర్‌టిసి కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు.

బస్ ఆన్ కాంట్రాక్ట్ చార్జీలు తగ్గింపు
అద్దె ప్రాతిపదికన ఆర్‌టిసి బస్సు చార్జీలను తగ్గించినట్లు సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డిలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. శబరిమలకు, శుభముహుర్తాలకు అద్దెకు ఆర్‌టిసి బస్సులను బుకింగ్ చేసుకుని యక్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు మునిశేఖర్, వినోద్ కుమార్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ఫ, హెచ్వోడీలు శ్రీదేవి, శ్రీధర్, వెంకన్న, సుధా పరిమళ, విజయభాస్కర్, శ్రీనివాసరావులతో పాటు వర్చ్వల్గా ఆర్‌ఎంలు, డిప్యూటీ ఆర్‌ఎంలు, డీఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News