Saturday, November 23, 2024

నాలుగు విడుతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు చెల్లింపులు..

- Advertisement -
- Advertisement -

నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, దశల వారీగా లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పునాదికి రూ.లక్ష, గోడలకు రూ.లక్షా 25వేలు, శ్లాబ్‌కు రూ.లక్షన్నర ఇల్లు పూర్తయ్యాక మరో లక్ష రూపాయల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు మిగతా మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తుందన్నారు.

రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నామని ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రభుత్వం తరపున రూ.5 లక్షల సాయం ఇస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600-ల నుంచి 800 ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తామని మంత్రి హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News