Saturday, November 23, 2024

జమ్మూకశ్మీర్‌లో బిజెపి శాసనసభాపక్ష నేతగా సునీల్ శర్మ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ బిజెపి శాసనసభాపక్ష నేతగా మాజీ మంత్రి సునీల్ శర్మ ఆదివారం ఎన్నికయ్యారు. కిష్త్వార్ జిల్లాలోని పెద్దర్ నాగసేని ఎంఎల్ఏ అయిన  ఆయన జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఒప్పుకున్నారు.

“సునీల్ శర్మ బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారు” అని ఇక్కడ జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత బిజెపి అధికార ప్రతినిధి తెలిపారు.

47 ఏళ్ల బిజెపి నాయకుడు జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో రెండోసారి ఎన్నికయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతంలో 2022 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత కొత్తగా సృష్టించబడిన నియోజకవర్గమైన పెద్దర్ నాగసేని నుండి శర్మ స్వల్ప తేడాతో గెలిచారు. శర్మ 2014 నుండి 2018 వరకు పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి పార్టీ అభ్యర్థిగా నరేందర్ సింగ్ ఉంటారని అధికార ప్రతినిధి తెలిపారు.

అసెంబ్లీలో తన ప్రాధాన్యతలు ఏమిటని అడిగిన ప్రశ్నకు శర్మ… “నేను ఇప్పుడే నియమితుడినయ్యాను. రేపు పోరు ప్రారంభమవుతుంది. శత్రువు ఎక్కడ దాక్కున్నాడో చూడాలి,  దాని ప్రకారం మేము దాడి చేస్తాము” అని శర్మ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News