Friday, November 22, 2024

మళ్లీ గెలిస్తే నెలకు 7 కిలోల రేషన్

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ రాష్ట్రంలో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే పీడీఎస్ కింద ఇచ్చే రేషన్ మొత్తాన్ని పెంచుతామని, అలాగే పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదివారం ప్రకటించారు. ప్రస్తుతం 5 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తుండగా, దానిని 7 కిలోలకు పెంచుతామని వెల్లడించారు. మరికొన్ని హామీలు సిఎం వెల్లడించారు. ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 11 లక్షల మందికి రేషన్ కార్డులు రద్దు చేశారని , దీనివల్ల చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని ఆరోపించారు.

ఇది కాకుండా మాయన్ సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నభోజనంలో పిల్లలకు గుడ్లు, పండ్లు కూడా అందజేస్తామన్నారు. సామాజిక భద్రత విషయంలో తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. 40 లక్షలకు పైగా వృద్ధులు , ఒంటరి మహిళలు, వికలాంగులకు సామాజిక భద్రతా పెన్షన్‌తో అనుసంధానించడం, శ్రామిక వర్గానికి పెన్షన్ వయస్సు 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గించడం, 1850 సంవత్సరాల వయస్సు గల మహిళలకు మయా సమ్మాన్ యోజన వంటి అనేక పథకాలను అమలు చేసినట్టు గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News